సిఎం నగర బాట, కెకె శాంతి యాత్ర
హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తనకు ఇష్టమైన పశ్చిమగోదావరి జిల్లాలో రాజీవ్ నగర బాట కార్యక్రమంలో పాల్గొనగా పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు కరీంనగర్ జిల్లాలో శాంతి యాత్ర ప్రారంభించారు. ముఖ్యమంత్రి నగరబాటలో పోలీసులు ఓవరాక్షన్ చేయగా కేశవరావు శాంతి యాత్రకు జనం కరువయ్యారు. నక్సలైట్లు హింసా మార్గం వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేశవ రావు పిలుపు ఇచ్చారు. కాగా ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో వారి సిఎంకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి దీనిపై కలెక్టరును మందలించారు.












Click it and Unblock the Notifications
