కాపు కార్పోరేషన్ రుణాల పై చంద్రబాబు కీలక ఆదేశాలు - జెన్ జీ పై అలర్ట్...!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలు పైన కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసారు. కొందరు అధికారుల తీరు పైన సీరియస్ అయ్యారు. జెన్ జీ ఉద్యమాల పైనా విశ్లేషణ చేసిన చంద్రబాబు.. కాపు కార్పోరేషన్ నిధుల విషయంలో స్పష్టత ఇచ్చారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పైన అలక్ష్యం వద్దని.. వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని స్ప్టష్టం చేసారు.
కలెక్టర్ల సదస్సు రెండో రోజు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పలు అంశాల పైన అధికారులకు స్పష్టత ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే జెన్ జీలు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. ప్రజలకు సరైన న్యాయం జరగకపోతు ఎవరైనా ప్రశ్నిస్తారని చెప్పారు. ప్రజా సమస్యల పై వెంటనే స్పందించాలని స్పష్టం చేసారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఏయే సంక్షేమ పథకాలు.. ఏయే తేదీల్లో ఇస్తున్నామనే అంశాన్ని తేదీలతో సహా వెల్లడించాలని సూచించారు. సంక్షేమం కింద అందిస్తున్న నగదు సద్వినియోగం చేసుకునే అంశంపై.. లబ్దిదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వారికి స్పష్టం చేశారు. కులవృత్తులకు సంబంధించి వాల్యూ అడిషన్ చేసేలా.. కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

అధికారులకు దిశా నిర్దేశం
అదే విధంగా చేనేత, చేతి వృత్తుల కేంద్రాలను ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంక్షేమ పండగలు చేద్దామని వారికి వివరించారు. కాపు కార్పొరేషన్ లోన్‌ల విషయంలో.. ఎక్కడైనా నిధులు ఉండిపోతే వాటిని వెంటనే వాడాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిధులు లేకపోతే తన దృష్టికి తీసుకురండి.. వెంటనే మంజూరు చేస్తానని అన్నారు. ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కరెక్ట్ కాదు.. మన కాన్సెప్ట్ కంబైన్డ్ ఫ్యామిలీ అని చెప్పారు. పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు కల్పించేలా.. పాలసీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేవాదాయ శాఖలో ఆదాయం వచ్చినట్టే మైనార్టీ శాఖలో కూడా రావాలని వారికి స్పష్టం చేశారు. ఒక్క వెంకటేశ్వరస్వామి దేవస్ధానంలో ఒక్కరోజులో రూ. 7 కోట్లు ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ఆస్తులు చాలా ఉన్నాయని.. వాటి నుంచి ఆదాయాన్ని ఆర్జించే మార్గాలు చూడాలన్న వారికి సీఎం వివరించారు.












Click it and Unblock the Notifications
