తెలంగాణరాష్ట్రం రాదని చెప్పగలరా: విజయశాంతిసవాల్
హైదరాబాద్:కాంగ్రెస్, బిజెపిలకు దమ్ముంటేతెలంగాణ రాష్ట్రం ఏర్పడబోదనిస్పష్టమైన ప్రకటన చేయాలని సినీనటి,బిజెపి నాయకురాలు విజయశాంతిశనివారం సవాలు విసిరారు. తెలంగాణప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకునిరాజకీయ నాయకులు తమ స్వార్ధప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారనిఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ పేరుతో లాభ పడినరాజకీయ నాయకులెవరూ తెలంగాణప్రజలకు మేలు చేయలేదని ఆమె అన్నారు.తెలంగాణ గురించి చిత్త శుద్ధి ఉన్న తానుచెన్నై నుంచి త్వరలోహైదరాబాద్‌కు మకాంమార్చుతున్నానని ఆమె చెప్పారు. తానుతెలంగాణ వ్యక్తిని కానని కొందరుదుష్ఫ్రచారం చేస్తున్నారని, తనఅభివృద్ధిని తట్టుకోలేక వారు ఈవిధమైన ప్రచారం చేస్తున్నారని ఆమెఅన్నారు. బిజెపిలో కొనసాగుతూ ఆమెబిజెపిని విమర్శించడం గమనార్హం.ఆమె త్వరలో సొంతంగా ఒక పార్టీ పెట్టితెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతాననిప్రకటించబోతున్నట్టు విశ్వసనీయంగాతెలిసింది.












Click it and Unblock the Notifications
