అక్రమ ఆయుధ సరఫరా ముఠా పట్టివేత
హైదరాబాద్: బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను ఇద్దరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు స్టెన్‌గన్‌లను, ఒక రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన సంజయ్ రాజ్‌ను, దీపక్ మిశ్రా అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగర అదనపు కమీషనర్ ఎ.కె. ఖాన్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. రాకేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంత శక్తివంతమైన ఆయుధాల అక్రమ సరఫరాను కనిపెట్టడం హైదరాబాద్‌లో ఇదే మొదటిసారి. ఈ ముఠా నక్సలైట్లకు ఆయుధాలను సరఫరా చేస్తోందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నట్లు ఖాన్ తెలిపారు.












Click it and Unblock the Notifications
