వ్యక్తిగత కారణాలతో అనితాసేన్ కోర్టుకు గైర్హాజర్
హైదరాబాద్: వ్యక్తిగత కారణాల వల్ల శిశు విక్రయాల కేసును విచారిస్తున్న నాంపల్లి అదనపు సెషన్స్ కోర్టుకు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) భార్య అనితాసేన్ హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని, ఇందుకు అనుమతించాలని ఆమె చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు అనుమతించింది. జూన్ 13వ తేదీన హాజరు కావాలని కోర్టు అనితాసేన్‌ను ఆదేశించింది.
శిశు విక్రయాల కేసులో తనపై నమోదు చేసిన సెక్షన్లు తనకు వర్తించవని, అందువల్ల తనను కేసున ఉంచి విముక్తం చేయాలని ఆమె కోర్టులో ఇంతకు ముందు డిశ్చార్జ్ పిటిషన్‌ను దాఖలు చేసుకుంది. దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
