కెసిఆర్, కాకాల మధ్య రాజీకి దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధినేత కె. చంద్రశేఖర్ రావుకు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామికి మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. దిగ్విజయ్ సింగ్ వెంకటస్వామి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
అంతకు ముందు టి ఆర్‌యస్ అగ్రనేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలు మిగతా తమ పార్లమెంటు సభ్యులతో కలిసి దిగ్విజయ్ సింగ్ వద్దకు వెళ్లారు. వెంకటస్వామిపై వారు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటస్వామి హద్దులు దాటి ప్రవరిస్తున్నారని వారన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్ వెంకటస్వామిని కలవడానికి వెళ్లారు.
వెంకటస్వామి సీనియర్ నేత అని, ఆయనను గౌరవిస్తామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. వెంకటస్వామి అలా బాధాకరమని, అలా మాట్లాడాల్సింది కాదని ఆయన అన్నారు. నరేంద్ర కూడా అలా మాట్లాడాల్సింది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును సిపియం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందని, అయితే తెలంగాణ విషయంలో వామపక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయని కెసి ఆర్ తనకు చెప్పారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
