మేం నక్సల్స్‌తో చర్చలను ఆశిస్తున్నాం: కెకె
రాజమండ్రి: ప్రభుత్వం నక్సల్స్‌తో చర్చలకు కట్టుబడి ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. తమ విధానానికి అనుగుణంగా చర్చలు జరగాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఆయన గురువరం నాడు తూర్పు గోదావరి జిల్లాలో శాంతి సందేశ్ యాత్రను నిర్వహించారు.
తన యాత్ర వల్ల శాంతి నెలకొంటుందని తాను అనుకోవడం లేదని, అయితే కాస్తనైనా ఆలోచన కలుగ చేస్తుందని అనుకుంటున్నానని ఆయన అన్నారు. శాంతి స్థాపన విషయంలో నక్సల్స్ ఆలోచించాలని ఆయన కోరారు. మొదటి దశ చర్చలు ఫలప్రదమైనట్లు నక్సల్సే చెప్పారని, అటువంటప్పుడు రెండో దశ చర్చలకు ముందుకు వచ్చే ఆలోచన చేయడం మంచిదని ఆయన అన్నారు.
మున్సిపల్, కార్పోరేషన్ల చైర్మన్ల ఎన్నికకు పరోక్ష పద్ధతే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. మేయర్, చైర్మన్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో పిసిసి జోక్యం చేసుకోదని ఆయన చెప్పారు. స్థానికంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
