వైయస్ కాన్వాయ్‌లో జామర్ ఏర్పాటు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కాన్వాయ్‌లో జామర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మారిన పరిస్థితుల దృష్ట్యా వైయస్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ జామర్‌ను ఏర్పాటు చేశారు. నక్సలైట్లతో శాంతి చర్చలు విఫలమై, నక్సలైట్ల నుంచి ముప్పు ప్రమాదం ఉండడంతో ప్రముఖుల భద్రతను పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వైయస్ కాన్వాయ్‌లో జామర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లో జామర్ ఉండేది. వైయస్ ముఖ్యమంత్రి కాగానే ఆయన కాన్వాయ్‌లోనూ జామర్‌ను ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అందుకు నిరాకరించారు. దీంతో ఇప్పటి వరకు వైయస్ కాన్వాయ్‌లో జామర్ లేదు.












Click it and Unblock the Notifications
