సొంత పూచీకత్తుపై గద్దర్, వివిల విడుదల
హైదరాబాద్: విప్లవ రచయితలు వరవరరావు, గద్దర్‌లను సొంత పూచీకత్తుపై పోలీసులు గురువారం విడుదల చేశారు. హైదరాబాద్‌ని ఆల్వాల్‌లో గల సుభాష్‌నగర్‌లో అమర వీరుల స్థూపాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని బుధవారంనాడు అరెస్టు చేశారు. వారితో పాటు విప్లవ రచయిత రత్నమాల, అమరవీరుల బంధు మిత్రలు కమిటీకి చెందిన పద్మకుమారి, రాందేవ్, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
సుభాష్‌నగర్‌లో మాత్రం 144వ సెక్షన్ కొనసాగుతూనే ఉంది. నక్సల్స్ అమరవీరుల స్మారకార్థం సుభాష్‌నగర్‌లో 46 అడుగుల స్థూపాన్ని నిర్మించారు. దాన్ని ఆవిష్కరించడానికి వరవరరావు, గద్దర్ తదితరులు బుధవారంనాడు ప్రయత్నించారు. స్థూపావిస్కరణకు అనుమతి ఇవ్వని పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకుని అరెస్టులు చేశారు.












Click it and Unblock the Notifications
