కాకా, కెసిఆర్ వివాదం ప్రభావం చూపదు: వైయస్
తిరుమల: తెలంగాణ విషయంలో తమ పార్టీ లోక్‌సభ సభ్యుడు జి. వెంకటస్వామి, తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు మధ్య తల్తెతిన వివాదం కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపబోదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. నక్సలైట్లపై నిషేధం విధించే విషయంలో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నక్సల్స్ కార్యకలాపాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.
తిరుపతి, తిరుమలలో ఆయన గురువారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలలో స్వామివారిని సందర్శించుకున్నారు. పరిటాల రవి హత్య కేసులో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్తవేనని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలో నిజం లేదని ఆయన అన్నారు.
మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలను, రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
