యన్‌డిఎలో చీలికే, టిడిపితో మాట్లాడుతాం: బసు
కోల్‌కత్తా: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) పార్లమెంటు సమావేశాల బహిష్కరణకు తెలుగుదేశం దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం యన్‌డి ఎలో చీలికేనని సిపియం వృద్ధ నాయకుడు జ్యోతిబసు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఇష్టమైతే వామపక్ష నాయకత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నదని ఆయన శుక్రవారం విలేకరులతో చెప్పారు.
పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలన్న టిడిపి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. తెలుగు దేశం నిర్ణయం చాలా మంచిదని, యన్‌డి ఎకు నాయకత్వం వహిస్తున్న బిజెపితో కొనసాగడం తప్పని టిడిపి ఇప్పుడు గ్రహించిందని ఆయన అన్నారు. అనుభవం ద్వారా అర్థం చేసుకుని ఎట్టకేలకు టిడిపి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమ సంకేతమని ఆయన అభిప్రాయపడ్డారు. యన్‌డి ఎతో చేతులు కలిపి టిడిపి ఆంధ్రప్రదేశ్ వినాశానానికి కారణమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
