తెలంగాణపై విజయశాంతిది అత్యుత్సాహం: శోభ
హైదరాబాద్: తెలంగాణ విషయంలో సినీ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలుగుదేశం పార్టీ మహిళా నేత శోభారాణి వ్యాఖ్యానించారు. చెన్నై వదిలి హైదరాబాద్‌కు వచ్చి విజయశాంతి ప్రకటనలు విడుదల చేయాలని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. విజయశాంతి తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆమె అన్నారు.
సినిమాల్లో అకాశాలు రాకపోతే విజయశాంతి ప్రభుత్వేతర సంస్థలాంటివేవో పెట్టుకుని తెలంగాణలో పని చేయాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వస్తే తాము కూడా కలిసి పని చేస్తామని ఆమె అన్నారు. తనది వరంగల్ జిల్లా రామన్నగూడెం అని చెప్పుకుంటున్న విజయశాంతి మాటల్లో నిజం లేదని ఆమె అన్నారు. తన తాతముత్తాతల చరిత్ర ఏమిటో చెప్పాలని ఆమె విజయశాంతిని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
