ఇరాక్‌లోకారు బాంబు దాడులు: 64 మంది మృతి
బాగ్దాద్:పశ్చిమఇరాక్‌లో బుధవారం గంట వ్యవధిలో జరిగిననాలుగు కారుబాంబు పేలుళ్ళలో 64 మంది మరణించారు.ప్రధాని ఇబ్రహీం అల్-జఫారీ ప్రభుత్వానికివ్యతిరేకంగా ఈ నెలలో మొదలైన తిరుగుబాటుదాడుల్లోఇది తీవ్రమైంది. కారుబాంబు దాడులు జరుగుతున్నసమయంలోనే అమెరికా దళాలు అబూ ముసాబ్‌అల్-జర్కావి నేతృత్వంలోని తిరుగుబాటుదారులతోపోరాటానికి తలపడ్డాయి.
ఉత్తర తిక్రిత్‌లో ఒకబస్టాపులో మొదటి పేలుడు సంభవించింది. ఈపేలుడులో 31 మంది మరణించగా, 71 మందిగాయపడినట్టు పోలీసు అధికారి తెలిపారు.ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్‌స్వస్థలమైన తిక్రిత్‌లో దాడి జరిగిననేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. కిర్కుక్‌నగరానికి వాయవ్యంగా హవిజా పట్టణంలోసైనిక రిక్రూట్‌మెంట్ శిబిరంపై శక్తివంతమైనఆత్మాహుతి దాడి జరిగింది. ఉద్యోగార్థులు క్యూలోనిలబడి ఉన్న సమయంలో జరిగిన ఈ దాడిలో 30మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications