బెంగుళూర్‌లో అందరివాడు పైరసీ సిడీలు
హైదరాబాద్: చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమా పైరసీ సిడీలను నిర్మాతలు పట్టుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల శుక్రవారం మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. పైరసీ సిడీలను చూపించారు. పైరసీ సీడిలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం తెచ్చినా ఈ బెడద తప్పడం లేదని శ్రీను వైట్ల అన్నారు. అందరివాడు సినిమా పైరసీ సీడిలను బెంగుళూర్‌లో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌కు తరలించే సమయంలో అవి తమ చేతికి చిక్కినట్లు ఆయన చెప్పారు. పైరసీ సిడీలు బెంగుళూర్‌లో తయారవుతున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
