మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు
హైదరాబాద్: మహాత్మాగాంధీకి రాష్ట్రంలో ఘనంగా నివాళి అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా గవర్నర్ సుశీల్ కుమార్ షిండే, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆదివారంనాడు హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద గాంధీజికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, మం6తులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి.
అంతకు ముందు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీ ఆశయాలకు ఎనలేని ప్రాసంగికత ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications