మహాజన్ ఆరోగ్యం మరింత విషమం
ముంబాయి: భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ప్రమోద్ మహాజన్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారింది. ఊపిరి తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆయనకు వెంటిలేటర్ల అవసరం బాగా పెరిగిందని డాక్టర్లు సోమవారం వెల్లడించారు. ఆయన ఆరోగ్య స్ధితి మెరుగయ్యేంతవరకు ఆయన శరీరంలోని బుల్లెట్లను తొలగించే ప్రయత్నం చేయబోమని వారు చెప్పారు. ప్రాంక్రియాస్ బాగా దెబ్బతిన్నప్పటికీ తాము రక్త స్రావాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామే తప్ప ఆపరేషన్ జోలికి పోవడం లేదని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications