బీటెక్ కాలేజీలో తీవ్ర విషాదం.. లైటింగ్ సిస్టమ్ కూలి ఇద్దరు స్టూడెంట్స్ మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ నాదర్ గుల్ లోని MVSR ఇంజినీరింగ్ కాలేజీలో దసరా పండగ సందర్భంగా నిర్వహించిన దాండియా వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. దాండియా వేడుకల కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఇద్దరు స్టూడెంట్స్ మృతి చెందారు. మరో 15 మందికి గాయాలైనట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థినిని వనపర్తికి చెందిన సోనీగా గుర్తించారు.
ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. మృతి చెందిన మరో విద్యార్థి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనలో సోనీ సోదరికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. దాంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్ని ఎల్ బీ నగర్ లోని కామినేని ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నట్లు స్పష్టం ఆదిబట్ల పోలీసులు స్పష్టం చేశారు.
Hyderabad: Two killed as lighting poles collapse at MVSR Engineering college Dandiya eventAn incident at a Dandiya event at MVSR Engineering College in Nadergul reportedly left two students dead and several others injured after lighting poles collapsed during the programme, according to preliminary reports.One of the deceased has been identified as Sony, who was from Wanaparthy. Sony’s sister is also in critical condition and has been shifted to another hospital, according to the information received.Five other students are reportedly in critical condition. They were shifted to Kamineni Hospital in LB Nagar for treatment.The lighting poles reportedly collapsed suddenly while students were taking part in the Dandiya celebrations. College staff and others rushed the injured to hospitals.Further details awaited.#DandiyaEvent #Hyderabad #LBNagar #MVSREngineeringCollege
— Sudhakar Udumula (@sudhakarudumula) October 17, 2026
MVSR ఇంజినీరింగ్ కాలేజీ రాత్రిపూట ఒక్కసారిగా గాలివాన రావడంతో దాండియా ప్రోగ్రామ్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఆదిబట్ల పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే ఇక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థుల్ని సమీప ఆస్పత్రులకు తరలించామన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్ బీ నగర్ లోని కామినేని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు ఈ విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ ఘటనపై అటు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిరసన వ్యక్తం చేస్తూ కాలేజీలోకి దూసుకెళ్లి ఫర్నీచర్ ను ధ్వంసం చేశాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆదిబట్ల పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
