విజయవాడ మేయర్ బరిలోకి ఏబీ వెంకటేశ్వర రావు, వారి మద్దతుతో- బిగ్ టర్న్..!!
విజయవాడ మేయర్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం. కూటమి పొత్తుల్లో లెక్కల్లో భాగంగా ఈ సీటు విజయవాడకు కేటాయించారు. ఇక్కడ నుంచి వంగవీటి రాధాను పార్టీ మేయర్ అభ్యర్దిగా ప్రకటన చేసింది. కాగా.. వైసీపీ నుంచి మాజీ మేయర్ రాయన బాగ్యలక్ష్మి పేరు ప్రకటించింది. కాగా, చివరి రోజు నామినేషన్ల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మేయర్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ఇప్పుడు మొత్తంగా కీలక మలుపుగా మారుతోంది.
విజయవాడ మేయర్ ఎన్నిక ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్దిగా జనసేన నుంచి వంగవీటి రాధ పోటీ చేస్తున్నారు. ఇందు కోసం రేపు నామినేషన్ల చివరి రోజున వంగవీటి రాధా నామినేషన్ దాఖలు చేయటానికి సిద్దం అవుతున్నారు. కూటమి నుంచి ఇక్కడ రాధా గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సమయంలో వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మీ పేరు ఖరారు చేసారు. కాగా.. ఇప్పుడు ఆకస్మికంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మేయర్ బరిలో దిగుతున్నారు. రేపు నామినేషన్ వేసేందుకు నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే సీపీఐ, సీపీఎం నుంచి మద్దతు కూడగట్టిన ఏబీ వెంకటేశ్వర రావు కాంగ్రెస్ మద్దతు కోరుతూ పీసీసీ చీఫ్ షర్మిలకు లేఖ రాసారు. ఇండియా కూటమి నుంచి మద్దతు ఇవ్వాలని లేఖలో ఏబీ వేంకటేశ్వర రావు అభ్యర్ధించారు.

బెజవాడ మేయర్ పోరులో కీలక మలుపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఏబీ వెంకటేశ్వ రావు ప్రశ్నిస్తున్నారు. 22ఏ భూముల వివాదంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఏబీ వెంకటేశ్వర రావు ప్రభుత్వ తీరును తప్పు బడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వ రావు ఆకస్మికంగా మేయర్ బరిలో దిగటం విజయవాడ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. కాగా.. విజయవాడలో పట్టు ఉన్న వామపక్షాలు మద్దతు తో ఏబీ బరిలోకి దిగుతున్నారు. దీంతో.. ఏబీ వెంకటేశ్వర రావు బరిలో నిలుస్తే ఎవరి ఓట్లకు గండి కొడతారు.. ఎవరికి మేలు జరుగుతుందీ.. ఏ మేర ప్రభావం చూపుతారనేది ఈ కీలక పోరులో మరింత ఉత్కంఠగా మారుతోంది.













Click it and Unblock the Notifications
