ప్రొఫెసరుకు కులవైషమ్యం: విద్యార్థుల ధర్నా
కర్నూలు: విశ్వనాథరెడ్డి అనే ప్రొఫెసర్ కులవైషమ్యాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ కర్నూలు వైద్య కళాశాల విద్యార్థులు శుక్రవారంనాడు రోడ్డెక్కారు. విశ్వనాథ రెడ్డికి వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. విశ్వనాథ రెడ్డి అలాంటివారు కాదంటూ మరో వర్గం విద్యార్థులు అదే చోట ప్రదర్శన చేశారు.
ఇరు వర్గాల మధ్య కలెక్టర్ కార్యాలయం వద్ద వాగ్వివాదం జరిగింది. విశ్వనాథ రెడ్డి ఒక వర్గం విద్యార్థులను వాడుకుంటూ కులవైషమ్యాలను పెంచి పోషిస్తున్నాడని, తమను వేధిస్తున్నాడని ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థులు అంటున్నారు. అయితే అటువంటిదేమీ లేదని మరో వర్గం విద్యార్థులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications