మావోయిస్టు అగ్రనేత రమాకాంత్ లొంగుబాటు
మహబూబ్ నగర్: మావోయిస్టు మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి, దక్షిణ తెలంగాణ యాక్షన్ టీం కమాండర్ రమాకాంత్ అలియాస్ గుంటి శ్రీను శుక్రవారంనాడు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ ముందు లొంగిపోయాడు. ఆయనది వెల్దండ మండలం అజిలాపురం గ్రామం. మక్తల్ శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి హత్య కేసులో రమాకాంత్ ప్రధాన నిందితుడు. రమాకాంత్ పై 20కి పైగా కేసులున్నాయి. ఆయనపై ప్రభుత్వం 5 లక్షల రివార్డు ప్రకటించింది.
జిల్లా కార్యదర్శి సాంబశివుడు రాష్ట్ర కార్యదర్శిగా వెళ్లిపోవడంతో రమాకాంత్ ఆ స్థానంలో జిల్లా కార్యదర్శిగా నియమితుడయ్యాడు. జిల్లా కార్యదర్శిగా నియమితుడై ఏడాది కూడా కాలేదు. గత 17 ఏళ్లుగా అతను అజ్ఞాతంలో ఉన్నాడు. మధ్యలో ఒకసారి అరెస్టయిన రమాకాంత్ బెయిల్ పై విడుదలై మళ్లీ పార్టీలో చేరాడు. రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడితో నెలకొన్న విభేదాలే రమాకాంత్ లొంగుబాటుకు కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications