తండ్రిని కలుస్తాం: మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ
హైదరాబాద్: తన తండ్రిని ఈ సాయంత్రం కలుస్తామని ప్రేమ వివాహం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ చెబుతోంది. ఒక ప్రైవేట్ చానెల్ ప్రతినిధితో శ్రీజ మాట్లాడారు. శిరీష్ భరద్వాజ్ అనే బి.టెక్. గ్రాడ్యుయేట్ ను ఆర్యసమాజ్ లో ఆమె వివాహం చేసుకుంది. తాము ఎప్పటికీ విడిపోబోమని ఆమె చెప్పారు. ప్రేమ వివాహం తర్వాత వారు ఒక రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు.
తాము నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, కామన్ ఫ్రెండ్స్ ద్వారా తమకు పరిచయమైందని ఆమె చెప్పారు. చిరంజీవి కుటుంబం నుంచి ఒత్తిడి రావచ్చుననే ఆందోళనకు వారు గురవుతున్నట్లు కనిపిస్తోంది. తాము వివాహం చేసుకుంటున్నట్లు ఈ నెల 12వ తేదీన సికింద్రాబాదులోని న్యూ బోయిన్ పల్లిలోని అర్యసమాజ్ కు తెలియజేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. బుధవారం ఉదయం తాను ఇంటినుంచి పారిపోయి వచ్చినట్లు శ్రీజ చెప్పారు. శ్రీజ వయస్సు 18 ఏళ్లు, భరద్వాజ్ వయస్సు 22 ఏళ్లు అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications