హనుమంత వాహనంపై వెంకన్న ఊరేగింపు
తిరుమల: శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో బుధవారం వేంకట నారాయణుడు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు. వరుసగా ఆరో జు జరుగుతున్న ఉత్సవాలలో హనుమంత వాహనంపై శ్రీవారు తిరుమల నాలుగు మాడ వీధులలొ ఊరేగుతున్నారు.
తిరుమల సందర్శించే భక్తుల సంఖ్య అధికం కావడంతో అధికారులు నానా యాతనలు పడుతున్నారు. రోజుకు సగటున 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. విఐపి, సెల్లార్ దర్శనాలను నిలిపివేసి మహా లఘు దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. అయినా వెంకన్న దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
కిలోమీటర్ల మేర క్యూ కాంప్లెక్స్ లు నిలిచిపోయాయి. ఎనిమిది క్యూ కాంప్లెక్స్ లలో భక్తులు నిలిచిపోయారు. భక్తూలకు అక్కడే ఆహారం సరఫరా చేస్తున్నారు. బుధవారం సాయంత్రం శ్రీవారు గరుడ వాహనంలో తురుమాడ వీధుల్లో విహరించనున్నారు.












Click it and Unblock the Notifications