కేంద్రంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు: బాబు
విజయవాడ: వరికి మద్దతు ధరపై చూపుతున్న వివక్షకు ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. వరికి మద్దతు ధర కల్పించాలని డిమాండు చేస్తూ ఆయన శుక్రవారం కృష్ణా జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. వరికి మద్దతు ధర కల్పించకపోవడంపై రైతుల ఉద్యమం ఊపందుకుంటోందని ఆయన చెప్పారు.
వరికి మద్దతు ధర కల్పించాలనే డిమాండుపై తమ పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు. ఈ డిమాండుపై జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మిస్తామని ఆయన చెప్పారు. మూడేళ్లుగా వర్షాలు పడుతున్నా రాష్ట్రంలో రైతుల పరిస్థితి మారలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications