జర్నలిస్టును చంపేసిన ఏనుగులు
శ్రీకాకుళం: ఆంధ్రప్రభ విలేఖరి గుమ్మడి నాగరాజును శుక్రవారంనాడు ఏనుగులు చంపేశాయి. వివరాలు సేకరించి వార్తలు రాయడానికి నలుగురు జర్నలిస్టులు ఉదయం సీతంపేట మండలంలో ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్లారు. ఏనుగుల గుంపును చూడగానే నాగరాజు ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. ఫ్లాష్ వెలిగిన వెంటనే ఏనుగులు వారిపై దాడి చేశాయి. మిగతా ఎక్కడివారక్కడ పారిపోయారు.
అందరికన్నా ముందున్న నాగరాజును ఏనుగులు పొదల మాటుకు ఎత్తుకెళ్లాయి. అక్కడికి వెళ్లడానికి మిగతా వారు భయానికి గురయ్యారు. ఇంతలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు రంగప్రవేశం చేశారు. అయినా ఏమీ చేయలేకపోయారు. చివరకు నాగరాజు శవమై కనిపించాడు. అతన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా సీతం పేట ఏజెన్సీ ప్రాంతంలో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications