అధికారులు బలిపశువులా: రాఘవులు
హైదరాబాద్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ప్రభుత్వం అధికారులను బలి పశువులను చేయడానికి ప్రయత్నిస్తోందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. అవుటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని తేలిపోయిందని, దోషులెవరని తేలాల్సి ఉందని, అయితే ప్రభుత్వం అధికారులను బలి పశువులను చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రతిష్టాత్మక రింగ్ రోడ్డు పథకం వ్యవహారాలు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఉన్నతాధికారులకు తెలియకుండా జరుగుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం సిబిఐ నివేదికను దాచే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ అక్రమాలు బయటకు రావాలంటే న్యాయ విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications