కొత్త జమీందారీ వ్యవస్థకు వైయస్ పునాది: టిడిపి
విశాఖపట్నం: ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో ప్రభుత్వం కొత్త జమీందారీ విధానాన్ని ప్రవేశపెడుతోందని తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ భూములను పెద్ద యెత్తున విక్రయిస్తూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థగా మారిందని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక మండళ్ల ముసుగేసుకుని ముందుకు వస్తున్నారని వారు విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు పెరిగాయే తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని వారన్నారు. బాంబు దాడులు, వరుస కిడ్పాప్ లతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వారన్నారు. తమ పార్టీ శాసనసభ్యుడు చెంగల వెంకట్రావుపై కేసు పెట్టడాన్ని వారు ఖండించారు.












Click it and Unblock the Notifications