జర్నలిస్టు శ్రీశైలంకు 19 వరకు రిమాండ్
ఒంగోలు: జర్నలిస్టు పిట్టల శ్రీశైలం మావోయిస్టు నేతలకు కొరియరుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. బుధవారంనాడు అదుపులోకి తీసుకున్న కందుకూరు పోలీసులు ఆయనను గురువారం నాడు ప్రకాశం జిల్లా కందుకూరు మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. శ్రీశైలంను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రీశైలంను పోలీసులు బుధవారంనాడు ఒక లాడ్జీలో అరెస్టు చేశారు.
మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాంబశివుడి ఆదేశాల మేరకు సానుభూతిపరుల నుంచి వసూలు చేసిన పది లక్షల రూపాయలు అందజేయడానికి శ్రీశైలం కందుకూరు వచ్చాడని, ఈ సమాచారం అందడంతో తాము శ్రీశైలంను అరెస్టు చేశామని సర్కిల్ ఇన్స్ పెక్టర్ విద్యాసాగర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. శ్రీశైలంపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని జర్నలిస్టు సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications