తెలంగాణలో కొత్త పథకం.. మీకు రూ. లక్ష రూపాయలు కావాలా..? వెంటనే ఇలా చేయండి..!
మీరు రూ. లక్ష రూపాయలు బహుమతి గెలుచుకోవాలని ఉందా..? అయితే మీకు ఇదే మంచి అవకాశం.. ఏమైందంటే..? హైదరాబాద్ క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తులు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి మంచి పేరు పెట్టిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.'

ఈ పథకానికి అత్యుత్తమమైన, ఆకర్షణీయమైన పేరు సూచించిన వారికి నగదు బహుమతి ఇస్తామని.. ఈనెల 28 వరకే ఛాన్స్ అని ఎండీ వీపీ గౌతం పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంలో బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు ఈ మేరకు తెలిపారు. ఆసక్తి కలిగినవాళ్లు తెలంగాణ హౌసింగ్ శాఖకు సంబంధించిన tghd.official పేరుతో ఉన్న ఇన్ స్టా పేజీ https://www.instagram.com/p/DZ6mCF_E1PY/ ద్వారా ఈ పోటీలో పాల్గొని పేరును సూచించవచ్చని స్పష్టం చేశారు.
క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ ఐజి ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని అన్నారు. ఇందుకు అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తామని, త్వరలోనే విధివిధానాలను వివరిస్తామని తెలిపారు. ఇక తెలంగాణ హౌసింగ్ శాఖ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ పెట్టడంతో యువతీయువకులు ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొంటున్నారు. వరుస కామెంట్స్ పెడుతూ పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications