Vijay-Trisha: విజయ్ తోనే త్రిష.. ఒక్క పోస్టుతో అందరి నోళ్లు మూయించిందిగా
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ జూన్ 22న తన 52 వ బర్త్ డే ను ఘనంగా జరుపుకున్నారు. విజయ్ బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ విజయ్- హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందని ప్రచారం జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ భార్య సంగీత విడాకులు తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా ఇదే వ్యవహారం కారణం అని సామాజిక మాధ్యమాల్లో అనేక కథనాలు వచ్చాయి.

అయితే విజయ్ బర్త్ డే సందర్భంగా త్రిష ఎలాంటి పోస్టు పెట్టలేదు.. విష్ చేయలేదు.. అంతేకాక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ ను ఆమె ప్రస్తుతం ఫాలో అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో త్రిష- విజయ్ మధ్య బ్రేకప్ జరిగిందని అందుకే విజయ్ ను త్రిష అన్ ఫాలో చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వాటన్నింటికీ ఒక్క పోస్టుతో త్రిష చెక్ పెట్టింది.
To the person who makes it all worth it,HBD❤️🧿
— Trish (@trishtrashers) June 23, 2026
00.00✨ pic.twitter.com/2e6QcueVRP
బర్త్ డే వేళ ఏకంగా విజయ్ తో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఈ పోస్టుకు హ్యాపీ బర్త్‌డే టూ ది పర్సన్ హూ మేక్స్ ఇట్ ఆల్ వర్త్ అని లవ్ సింబల్, టార్గెట్ సింబల్ పెట్టింది. ఈ సెలబ్రేషన్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగినట్టు హింట్ గా 00.00 అని కూడా పోస్ట్ చేసింది. దాంతో విజయ్- త్రిష బ్రేకప్ రూమర్స్ కు చెక్ పడినట్లు అయింది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నిమిషాల్లోనే లక్షల లైక్ లు, వేల కామెంట్స్ వస్తున్నాయి.












Click it and Unblock the Notifications