జూనియర్ డాక్టర్ల ర్యాలీ, సభ
హైదరాబాద్: తమపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరిగింది. ఈ ర్యాలీలో దాదాపు ఐదు వేల మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని వారు చెప్పారు. జూనియర్ డాక్టర్లు సమ్మె చేసినా ఇబ్బంది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యను వారు తప్పు పట్టారు. ముఖ్యమంత్రి ప్రకటన బాధ్యతారహితమైందని వారు విమర్శించారు.
నీలోఫర్ జూనియర్ డాక్టర్లపై దాడి చేసిన అఫ్సర్ ఖాన్ ను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చినా అమలు చేయడం లేదని వారన్నారు. తమ రక్షణకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల విషయంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను వేటినీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వారన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె సోమవారంనాటికి 19వ రోజుకు చేరుకుంది.












Click it and Unblock the Notifications