పలాస చైర్ పర్సనుగా లక్ష్మి ఎన్నిక
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ మున్సిపల్ చైర్ పర్సనుగా కోట్నీ లక్ష్మి ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక సోమవారంనాడు జరిగింది. మున్సిపాలిటీలో కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. అయితే చైర్ పర్సన్ పదవి కోసం భవానీ, లక్ష్మిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ స్థితిలో పార్టీ నాయకత్వం సీల్డ్ కవరులో లక్ష్మి పేరును రాసి పంపింది.
ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు లక్ష్మికి ఓటు వేయలేదు. శాసనసభ్యుడు, స్వతంత్ర కౌన్సిలర్లు ఓట్లతో లక్ష్మి గట్టెక్కింది. వైస్ చైర్ పర్సనుగా కాంగ్రెసుకు చెందిన సుధారాణి పాత్రో ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications