కిరణ్ కుమార్ రెడ్డికి రోజా సవాల్
హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డికి సినీనటి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా సవాల్ విసిరారు. కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును విమర్శించే హక్కు లేదని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేయడానికి చంద్రబాబులాంటి పెద్దలు అవసరం లేదని, దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆమె అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి చిత్తూరు జిల్లాలోని 15 శాసనసభా నియోజకవర్గాల్లో ఏ నియోజక వర్గం నుంచైనా తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ చేశారు.
ధైర్యం లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడాలని, తాను కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి పది వేల మెజారిటీతో ఓడిస్తానని ఆమె అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు సవాల్ చేశారు. కుప్పంలో సామాన్య కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డిని ఓడిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications