సోనియాతో రాజకీయాలపై వైయస్ చర్చ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారంనాడు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడి ఎంపికపై ఆయన సోనియాతో చర్చించారు. పెట్రోలియం శాఖా మంత్రి మురళీ దేవరను కూడా ఆయన కలుసుకున్నారు. కాకినాడలో రిఫైనరీ ఏర్పాటుపై ఆయన మురళీదేవరతో చర్చించారు. రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయాలని ఆయన మంత్రిని కోరారు.
కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కూడా ఆయన భేటీ అయ్యారు. వరికి మద్దతు ధర పెంటచాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. వినియోగదారుల పరిస్థితిని గమనించి ఈ విషయాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. వరికి మద్దతు ధర ఈ ఏడాది రు. 775 రూపాయలు ఉంటుందని, రు. 875 రూపాయలు ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications