సాయుధ అంగరక్షకులతో ఆలయంలోకి మంత్రి
శ్రీశైలం: రాష్ట్ర మంత్రి రెడ్యా నాయక్ శ్రీశైలం దేవాలయం ప్రవేశం తీరు వివాదానికి దారి తీసింది. రెడ్యా నాయక్ తన సాయుధ అంగరక్షకులతో ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలోకి ఆయుధాలతో ప్రవేశించకూడదనేది నియమం. కానీ స్వయానా మంత్రి కావడంతో సాయుధ అంగరక్షకులతో ఆలయంలోకి ప్రవేశించడంపై ఎవరూ నోరు మెదపలేదు.
సాయుధ అంగరక్షకులతో మంత్రి ఆలయంలోకి ప్రవేశించడంపై భక్తులు, ఆలయ సిబ్బంది బిత్తరపోయారు. మంత్రి కావడంతో అందరూ అవాక్కైపోయి చూస్తూ ఉండిపోయారు.












Click it and Unblock the Notifications