కొత్త ఏడాదిలో ఉపాదికి ప్రాధాన్యం: వైఎస్


హైదరాబాద్ : రానున్న నూతన ఏడాదిని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధినామ సంవత్సరంగా ప్రకటించింది. రానున్న రెండేళ్లలో ప్రభుత్వం లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. పాత ఏడాదికి వీడ్కోలు తెలుపుతూ నూతన ఏడాదికి స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్ధేశించి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన రానున్న నూతన ఏడాదిని ఉపాధినామ సంవత్సరంగా అభివర్ణించారు. తద్వారా రాష్ట్రంలో రానున్న రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నామని ఆయన వివరించారు.

డీఎస్సీ, పోలీసు, ఏపీపీఎస్సీ, విద్యుత్ తదితర రంగాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను ప్రకటించడం ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడుతామని ఆయన తెలిపారు. అలాగే రాజీవ్ ఉద్యోగ శ్రీ క్రింద రూ. వెయ్యి కోట్లను వెచ్చించడం ద్వారా ప్రైవేటు రంగంలో పది లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన, భవిష్యత్‌లో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాల గురించి ఈ లేఖలో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందుబాటులోకి తెవడమే సర్కారు లక్ష్యమని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+