బాసరలో ట్రిపుల్ ఐటికి సిఎమ్ శంకుస్థాపన
బాసర:ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఏర్పాటు చేయతలపెట్టిన ట్రిపుల్ ఐటి కి రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.ఈ ట్రిపుల్ ఐటి సంస్థకు రూ.1200కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టనుంది. ట్రిపుల్ ఐటి కి శంకు స్థాపన చేసిన తరువాత మఖ్యమంత్రి బాసర గుడిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జర్నలిస్టులను గుడిలోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా జర్నలిస్టులు గుడిముందు నిరసనకు దిగారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్టులు గుడిలోపలికి రాకుండా అడ్డుకున్న పోలీసులపై చర్యతీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు.












Click it and Unblock the Notifications