రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని రొంపిచెర్లకు సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లీసుల కథనం ప్రకారం బుధవారం ఉదయం నల్గొండకు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు నిర్ధారించారు.
వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగివస్తున్న సమయంలో వారు ప్రయణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
