వీడిన రూపాదేవి హత్య కేసు మిస్టరీ


హైదరాబాద్: హైదరాబాదులో జరిగిన ఎంబిఎ విద్యార్థిని రూపాదేవి హత్య మిస్టరీ వీడింది. రూపాదేవి అనే విద్యార్థిని ఈ నెల 6వ తేదీన హైదరాబాదులోగల కూకట్ పల్లిలో సొంత ఇంటిలోని దారుణ హత్యకు గురైంది. ఈ హత్య కేసులో పోలీసులు కొండ అనే కూరగాయల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించాడు. తన అనుచరులతో కలిసి రూపాదేవిని తానే హత్య చేశానని కొండ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేయాల్సి ఉంది.

ప్రేమవ్యవహారమే రూపాదేవి హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు మొదట జగన్ అనే యువకుడ్ని అనుమానించారు. అయితే అతనికి ఈ హత్యతో సంబంధం లేదని తేల్చుకున్న పోలీసులు ఇతర కోణాలు పరిశీలించారు. రూపాదేవి తండ్రి పక్కనే కూరగాయల వ్యాపారం చేసుకునే కొండ కనిపించకపోవడంతో అతనిపై దృష్టి పెట్టారు. విజయవాడలో అతన్ని పట్టుకుని ఆరా తీశారు. దీంతో అతనే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. కొండ నుంచి రూపాదేవి సెల్ ఫోనును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+