వైయస్ పై మధుయాష్కీ నిప్పులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధయాష్కీ నిప్పులు చెరిగారు. ఈ టర్మ్ లో తెలంగాణ ఇవ్వలేమని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ఆయన మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెసును భూస్థాపితం చేసేందుకు వైయస్ రాజశేఖర రెడ్డి కుతంత్రం చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద మండిపడ్డారు. ఇదే విషయాన్ని తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పబోతున్నామని, అయితే ముఖ్యమంత్రిని మార్చాలని కోరబోమని ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా అర్థబలం, అంగబలంతో తెలంగాణవాదులను అణగదొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి తీరు కుట్రలా కనిపిస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం అధిష్ఠానవర్గాన్ని ప్రభావితం చేస్తున్న తీరును, తెలంగాణను వంచిస్తున్న తీరును సోనియాకు వివరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, మంత్రి మారెప్పలను ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications