రూపాదేవి హత్య: ప్రధాన నిందితుడు రవి
హైదరాబాద్: ఎంబిఎ విద్యార్థిని రూపాదేవి హత్య కేసులో వారి బంధువు రవి ప్రధాన నిందితుడిగా తేలింది. రూపాదేవి హత్య కేసులో పోలీసులకు చిక్కిన కూరగాయల వ్యాపారి కొండ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి పోలీసులు కంగు తిన్నారు. రూపాదేవి హత్య జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి రవి. రూపాదేవి శవం వెంట కూడా ఉన్నాడు. పోలీసుల దర్యాప్తులో సహకరిస్తున్నట్లు నటించాడు.
రూపాదేవి సోదరుడు సత్యనారాయణపై కక్షతోనే ఆమెను హత్య చేసినట్లు రవి పోలీసు ఎదుట అంగీకరించాడు. సత్యనారాయణను చంపడం సాధ్యం కాక రూపాదేవిని హత్య చేసినట్లు అతను చెప్పాడు. రూపాదేవి కదలికలను రవి ఎప్పటికప్పుడు కొండకు అందిస్తూ వచ్చాడు. కొండతో కలిసి రవి కూకట్ పల్లిలోని ఆమె ఇంటిలోనే రూపాదేవిని హత్య చేశాడు. డబ్బుల కోసమే తాను రూపాదేవిని హత్య చేశానని మొదట కొండ చెప్పాడు.












Click it and Unblock the Notifications