కిడ్నీ రాకెట్ తో ఆంధ్రా లింకులు
న్యూఢిల్లీ: హర్యానాలోని గుర్గావ్ లో బయటపడిన కిడ్నీల రాకెట్ తో ఆంధ్రప్రదేశ్ కు సంబంధాలున్నట్లు గుర్గావ్ పోలీసు కమీషనర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ఆంధ్రా పోలీసులకు తెలియజేశారు. గుంటూరుకు చెందిన కొంతమందికి ఈ రాకెట్ తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన ఒకరిద్దరి నుంచి అక్రమంగా వీరు కిడ్నీలు సేకరించినట్లు చెబుతున్నారు. వీరిపై ఇది వరకు కేసు కూడా నమోదైంది. గుర్గావ్ లోని కిడ్నీ రాకెట్ ను పోలీసులు ఛేదించడంతో ఈ విషయాలు బయటపడ్డాయి.
అక్రమంగా కిడ్నీలు సేకరించిన ఐదుగురిని గుర్గావ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో అమిత్ కుమార్ అనే వైద్యుడు ఉన్నాడు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన వారి నుంచి 500 కిడ్నీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాకెట్ కు సంబంధించిన ప్రధాన వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. కిడ్నీలు ఇచ్చినవారు ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలకు చెందిన కూలీలు. వారి నుంచి 50 వేల నుంచి లక్ష రూపాయలకు ఒక్కో కిడ్నీని సేకరించి లక్షలాది రూపాయలకు వీరు అమ్ముకుంటూ వస్తున్నారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
