ఉప్పునూతలతో జయశంకర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో మ్యాచ్ ఫిక్సింగుకు పాల్పడాల్సిన అవసరం లేదని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి స్పష్టం చేశారు. తెరాస సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ శుక్రవారంనాడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని కలుసుకున్నారు. తెరాసవారికి కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవులు ఇచ్చి ఎవరు మ్యాచ్ ఫిక్సింగుకు పాల్పడ్డారో తెలుసునని పురుషోత్తమ రెడ్డి జయశంకర్ తో భేటీ అనంతరం అన్నారు. తమ పోరాటం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై కాదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తాము పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు.
తెలంగాణ సాధన కోసం పోరాటం సాగిస్తామని, తెలంగాణ అంశాన్ని నాన్చవద్దని తాము ఈ నెల 28వ తేదీన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్తామని ఆయన అన్నారు. తమకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ముఖ్యమని, అలా రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే అన్ని పార్లమెంటు సీట్లు గెలుచుకోగలమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎంత కాలం జరుపుతారని ఆయన అడిగారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇవ్వలేమంటున్నారని, ఒకరు ఇవ్వడం తాము తీసుకోవడం ఏమిటని, కలిపిన రెండు రాష్ట్రాలను విభజించాలని అడుగుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
