వీధి రౌడీల్లా మంత్రులు: చంద్రశేఖర్
హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు ఎ. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో గురువారం రాష్ట్ర మంత్రులు ర్యాలీ నిర్వహించిన పద్ధతిని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. ప్రభుత్వం బంద్ లు నిర్వహించడం ఏమిటని ఆయన అడిగారు.
తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు సమాధి కడతారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే ప్రజలు ఈ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ శాసనసభ్యులకు గోరీ కడుతారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
