కోర్టుకు హాజరైన పవన్ కళ్యాణ్

Pavan Kalyan
విశాఖపట్నం: భార్య నందిని దాఖలు చేసిన మనోవర్తి కేసులో సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారంనాడు ఫ్యామిలీ కోర్టు హాజరయ్యారు. ఈ కేసులో నందిని, పవన్ కళ్యాణ్ ఇద్దరూ హాజరు కావాల్సి వుండగా నందిని రాలేదు. పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం విశాఖపట్నం వచ్చారు. ఆయన బస చేసిన ప్రదేశాన్ని రహస్యంగా ఉంచారు. ఆయన మధ్యాహ్నం నేరుగా కోర్టుకు వచ్చారు. ఆయన చూసేందుకు పెద్ద యెత్తున కోర్టు వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా కొద్ది పాటి తొక్కిసలాట కూడా జరిగింది.

వాహనం నుంచి దిగిన వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులకు అభివాదం చేసి కోర్టు లోపలికి వెళ్లిపోయారు. ఈ కేసు విచారణ రహస్యంగా జరుగుతోంది. నందిని హాజరు కాకపోవడంతో కేసు ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది. నెలకు 5 లక్షల రూపాయల మనోవర్తి కోరుతూ నందిని పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన విడాకుల కేసు కూడా ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+