పవన్ కేసు: ప్రొటెస్టు పిటిషన్ దాఖలు

ఈ కేసు విచారణ శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. మధ్యాహ్నం విచారణకు పవన్ కళ్యాణ్ తో పాటు నందిని కూడా హాజరు కావచ్చు. రేణూదేశాయ్ ని తాను పెళ్లి చేసుకోలేదని, ఆమెతో సహజీవనం మాత్రమే చేస్తున్నానని, తమకు పిల్లవాడు కూడా ఉన్నాడని పవన్ కళ్యాణ్ వాదిస్తున్నారు. పాస్ పోర్టు అఫిడవిట్ లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. దీంతో వారిద్దరి మధ్య వివాహం జరిగినట్లు ఆధారాలు లేవని కోర్టుకు పోలీసులు తమ నివేదికలో తెలియజేశారు. పోలీసు నివేదికను విశ్వసిస్తున్నామని కోర్టు తెలియజేసింది. విడాకుల కేసులో ఇరువురికి కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించవచ్చు.












Click it and Unblock the Notifications
