పోలీసుల అదుపులో సాంబశివుడు?
నల్లగొండ: మావోయిస్టు అగ్రనేత సాంబశివుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు ఆయన తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాంబశివుడు పోలీసు అదుపులో వెంటనే కోర్టులో హాజరు పర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాంబశివుడిని పోలీసులు ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దులో పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తన కుమారుడిని కోర్టులో హాజరు పరచాలని కోరుతూ సాంబశివుడి తల్లి కోనాపురి లక్ష్మమ్మ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. సాంబశివుడు తవ్వలకొండ ప్రాంతంలో పోలీసు వలయంలో చిక్కుకున్నట్లు శుక్రవారంనాడు ఒక దినపత్రికలో వార్త వచ్చింది. అయితే పోలీసులు ఆ విషయాన్ని ఖండించారు.
సాంబశివుడు పోలీసుల అదుపులో ఉన్నదీ లేనిదీ రేపు (శనివారం) తొమ్మిది గంటల లోపల తెలియజేయాలని మానవహక్కుల కమీషన్ డిజిపిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications
