తెలంగాణ ఖాయం: హర్షకుమార్


అమలాపురం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే ఆంధ్రాకే లాభమని, ఈ విషయం తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి చెప్పానని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాటలు బూటకమని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్టీఎ) ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఇవ్వని బిజెపి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతోందని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎవరికీ చెప్పకుండా శాసనసభలో తీర్మానం చేశారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+