యుపిలో ఐశ్వర్యారాయ్ పాఠశాల
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బారాబంకిలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాలికల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాఠశాల ఏర్పాటుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఆదివారం భూమి పూజ చేశారు. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, తమ కుటుంబ మిత్రుడు అమర్ సింగ్ జన్మదినం సందర్భంగా అమితాబ్ ఈ పూజా కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి జయాబచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతులు కూడా హాజరయ్యారు.
అనంతరం డిగ్రీ కళాశాలగా కూడా విస్తరించనున్న విద్యాసంస్థ భూమి పూజ కార్యక్రమానికి యుఎన్ పిఎ నాయకులు ములాయం సింగ్ యాదవ్, ఓం ప్రకాశ్ చౌతాలా, నారా చంద్రబాబునాయుడు తదితరులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆద్యంతం హిందీలో మాట్లాడారు. అమితాబ్, అమర్ సింగ్ ల సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications