తెలంగాణపై రాఘవులుకు నారాయణ ప్రశ్న
హైదరాబాద్: భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని మార్క్సిజంలో ఎక్కడా లేదని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. మార్క్సిజంలో ఎక్కడ ఉందో సిపియం కార్యదర్శి బి.వి. రాఘవులు చూపితే తాను చదువుకుంటానని ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్ప్యూలో చెప్పారు. తమపై సిపియం చెప్పినట్లు తాము నడుచుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. హిందీ మాట్లాడే వారు వివిధ రాష్ట్రాలుగా విడిపోయి ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడక ముందే గుర్తించామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తాము పార్టీ మహాసభల్లో తీర్మానం చేస్తామని ఆయన చెప్పారు. ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయం తీసుకోలేమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications