పోలవరం పనులు ఆగలేదు: వైయస్
ఖమ్మం: గోదావరి నదిపై చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడూ ఆగలేదని, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను 2011 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయన ఆదివారంనాడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సిపియం మిలిటెంట్ల తరహాలో వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయం దండుగ అన్నారని, ఇప్పుడు పండుగ అని తాము నిరూపిస్తున్నామని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్వాక్రా మహిళలను అన్ని విధాలా అదుకుంటామని ఆయన చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది 200 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు. మహిళల్ ఆర్థికాభ్యున్నతే తమ లక్ష్యమని, ఎవరు అడ్డు వచ్చినా సహించబోమని ఆయన చెప్పారు. ఎన్ని ఇబ్బందులైనా మహిళా కార్యక్రమాలకు నిధులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications